Health: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!

Health: మీ రోజువారీ అలవాట్లలో కొన్ని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.

Update: 2022-05-28 15:30 GMT

Health: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!

Health: మీ రోజువారీ అలవాట్లలో కొన్ని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. పురుషులకి ఉండే కొన్ని చెడు అలవాట్లు స్పెర్మ్ కౌంట్‌పై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో అధిక ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఆ చెడు అలవాట్లు వదిలేస్తే సరిపోతుంది. పురుషులలో ఒత్తిడి కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది . ఎందుకంటే ఆందోళన, ఒత్తిడి కారణంగా పురుషులలో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి.

వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల స్పెర్మ్ చలనశీలత తగ్గుతుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు ఈ రోజు నుంచే ఒకే చోట కూర్చునే అలవాటును వదిలివేస్తే మంచిది. దీని కారణంగా మీ జీవక్రియ మందగిస్తుంది. మీ బరువు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో పురుషులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు దీర్ఘకాలిక వినియోగం పురుషుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ అలవాట్ల వల్ల మీకు తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి.

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీరు ఒత్తిడి, ఊబకాయం సమస్యలను కలిగి ఉంటారు. ఇది మీ స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. దీంతో పాటు రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని ఉండటం వల్ల మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కారణంగా మీ స్పెర్మ్ కౌంట్ ప్రభావితమవుతుంది.

Tags:    

Similar News