Benefits of Walnuts: ఒత్తిడిని దూరం చేసే వాల్ నట్స్
Benefits of Walnuts: రోజూ గుప్పెడు వాల్ నట్స్ తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం తొక్క తీసి మాత్రమే వాడుకోవాలి.
Benefits of Walnuts: వాల్ నట్స్ తింటే ఎంతో ఆరోగ్యం అని ఈ మధ్య కాలంలో మనం తరుచుగా వుంటూనే వున్నాం. కానీ వాటిని చూడగా మెదడు ఆకారంలో వుంటూ అంత రుచిగా కూడా వుండవు కదా. కానీ అందులో వుండే ఆరోగ్య సుగుణాలు తెలుగుసుకుంటే మాత్రం అస్సలు వదిలి పెట్టరండి. మారుతున్న జీవన ప్రయాణంలో చాలా మంది అనేక ఒత్తిడులకు లోనవుతున్నారు. ఈ ఒత్తిడులను అధిగమించాలంటే రోజూకు ఓ గుప్పెడు వాల్ నట్స్ తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు వాల్ నట్స్ ని ఎలా వాడాలో హెచ్ ఎం టివి "లైఫ్ స్టైల్" లో చూద్దాం
ఒత్తిడి, డిప్రెషన్ కు దూరంగా
వాల్ నట్స్ లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గించడానికి దోహదపడతాయి. రెగ్యులర్ గా వాల్ నట్స్ ని నానబెట్టి తీసుకుంటూ ఉంటే.. మూడ్ ని కూడా మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ ఉంటాయి. ఇవన్నీ శరీరంలో మెటబాలిజంను చాలా వేగంగా మెరుగుపరుస్తాయి.
రాత్రంతా నానబెట్టి తొక్క తీసి వాడుకోవాలి
గుప్పెడు వాల్ నట్స్ తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం తొక్క తీసి తినాలి. లేదంటే.. ఈ తొక్క ద్వారా ఎక్కువ హాని కలుగుతుంది. వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి. వాల్ నట్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఒకే డ్రై ఫ్రూట్ లో లభించడం అమోఘం.
శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ వాల్ నట్స్ లో ఉంటాయి. ఎక్కువ సమయం వరకు ఇవి ఆకలి అనిపించకుండా.. ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే అదనపు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.
బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతో గుండె వ్యాధుల రిస్క్ దరిచేరదు. డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ కి వాల్ నట్స్ చక్కటి పరిష్కారం. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి. శరీరంలో క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను పూర్తీగా నాశనం చేస్తాయి.