Weight Loss Tips: ప్రతిరోజూ 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి..బరువు తగ్గడం పక్కా

Weight Loss Tips: ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించేందుకు కార్డియే వ్యాయామం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మంచి శ్వాస వ్యాయామం అని కూడా చెబుతున్నారు. ఇలా చేస్తే అధిక రక్తపోటు తగ్గి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Update: 2024-07-17 05:24 GMT

Weight Loss Tips: ప్రతిరోజూ 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి..బరువు తగ్గడం పక్కా

Weight Loss Tips:నేటి బిజీలైఫ్ కారణంగా చాలా మందికి వ్యాయామంచేయానికి సమయం దొరకడం లేదు. తమ ఆరోగ్యాన్ని తాము చూసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదు. అయితే వ్యాయామం చేయడానికి సమయం లేనివారు ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలి. ప్రతిరోజూ 5నిమిషాలు వాకింగ్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం:

పలు కథనాల ప్రకారం ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు కార్డియే వ్యాయామం అవసరం. ఇది మంచి శ్వాస వ్యాయామం అని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అధిక రక్తపోటు తగ్గి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతుంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గించడంలో:

నడక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది.కావు నడక వ్యాయామం పూర్తిచేసిన తర్వాత కూడా కేలరీలు తగ్గుతాయి. ఇది శరీరంలో ఆకలి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కండరాలను బలంగా:

రోజూ వాకింగ్ చేయడం వల్ల మన ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది శరీరంలో జీవక్రియను కూడా పెంచుతుంది.

ఒత్తిడి:

ప్రతిరోజూ 5 నుంచి 30 నిమిషాల పాటు చురుకైన నడక మన శరీరంలోని కార్టిసాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల ఒత్తిడి హార్మోన్ల కార్యకలాపాలు తగ్గుతాయి. ఇది ఎండార్ఫిన్ స్థాయిలను కూడా స్రవిస్తుంది. అంతేకాదు సంతోషకరమైన హార్మోన్లుగా చెబుతారు. దీని వల్ల మనసు, శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుంది.

నిద్ర:

మంచి నిద్ర కోసం ప్రతిరోజూ 5 నిమిషాల నుంచి అరగంటపాటు నడక మంచిదని వైద్యులు చెబుతున్నారు. పడుకునే ముందు ప్రతిరోజూ నడవడం మంచిది. ఇది మన నిద్ర స్థాయిని కూడా పెంచుతుంది. తద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని. మన శరీరంలోని సర్కాడియన్ రిథమ్ సరిగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

దీర్ఘకాలిక అనారోగ్యం:

దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గేందుకు రోజూ వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. నడక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించి..దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది.

గట్ ఆరోగ్యం:

జీర్ణరుగ్మతలను తగ్గించి..మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నడక చాలా మంచిది. నడిచేటప్పుడు కూడా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవచ్చు.

Tags:    

Similar News