Health Tips : భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయవచ్చా? ఈ టెక్నిక్ పాటిస్తే బెల్లీఫ్యాట్ ఐస్‎లా కరగడం ఖాయం..!

Health Tips : ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ అనేది సర్వసాధారణమైన సమస్య అని చెప్పవచ్చు.జీవనశైలిలో మార్పులు, పౌష్టికాహారం లోపం, గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం వంటి కారణాల వల్ల ప్రజల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య పెరుగుతోంది.

Update: 2024-06-19 01:30 GMT

Health Tips : భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయవచ్చా? ఈ టెక్నిక్ పాటిస్తే బెల్లీఫ్యాట్ ఐస్‎లా కరగడం ఖాయం..!

Health Tips : ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ అనేది సర్వసాధారణమైన సమస్య అని చెప్పవచ్చు.జీవనశైలిలో మార్పులు, పౌష్టికాహారం లోపం, గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం వంటి కారణాల వల్ల ప్రజల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య పెరుగుతోంది. బెల్లీ ఫ్యాట్ అనేది ఒక సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, అనేక వ్యాధులకు దారితీస్తుంది.ముఖ్యంగా కార్పోరేట్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వారి పొట్ట వేగంగా పెరుగుతుంది.

ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సహజంగానే పొట్ట కొవ్వు పెరుగుతుంది. డెస్క్ జాబ్స్ ఉన్న వ్యక్తులు వారి జీవనశైలి కారణంగా వివిధ వ్యాధులకు గురవుతారు.శారీరక శ్రమ లేకపోవడం వల్ల వారి జీర్ణక్రియ మందగిస్తుంది.చెడు కొలెస్ట్రాల్,ఊబకాయం వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.ఇది మరింత తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.ఇటీవలి అధ్యయనంలో, స్థూలకాయం, బెల్లీఫ్యాట్ సమస్య కార్పొరేట్ రంగంలో పనిచేసే వ్యక్తులలో సర్వసాధారణంగా మారింది. కాబట్టి ఈ వ్యక్తులు బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ ను అదుపులో ఉంచుకోవడానికి మధ్యాహ్న భోజనం తర్వాత ఒక పని చేయవలసి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.అదేంటో చూద్దాం.

భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు :

పెరుగుతున్న పొట్ట కొవ్వుపై ప్రపంచవ్యాప్త అధ్యయనంలో.. కార్యాలయంలో భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల నడక మంచిదని అని పేర్కొంది. బిజీ వర్క్ షెడ్యూల్స్ కారణంగా వ్యాయామం చేయలేని వారు ఆఫీసులో లంచ్ బ్రేక్ సమయంలో గరిష్టంగా 10 నిమిషాల నడవడం మంచిది. చాలా మందికి లంచ్ తర్వాత బరువుగా, బద్దకంగా అనిపిస్తుంది. ఇది కొంతమంది నిదానంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు, భోజనం చేసిన తర్వాత ఆఫీసులో 10 నిమిషాలు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

చాలా మందికి లంచ్ తర్వాత కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. లంచ్ బ్రేక్ సమయంలో తిన్న తర్వాత ఎసిడిటీ అనిపిస్తే నడక లాభిస్తుంది. నడక మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీ శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

జీవక్రియ వేగవంతం అవుతుంది:

లంచ్ తర్వాత నడవడం వల్ల మీ శరీరం జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది మీ శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా శరీర బరువు,పొట్ట కూడా తగ్గుతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

10 నిమిషాల నడక మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.సోమరితనాన్ని కూడా దూరం చేస్తుంది.

మధుమేహం అదుపులో ఉంటుంది:

భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే మీ శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

భోజనం తర్వాత నడవడానికి సరైన మార్గం:

మధ్యాహ్న భోజనం తర్వాత సరైన వాకింగ్ నియమాలు పాటిస్తే, పొట్టలోని కొవ్వును త్వరగా వదిలించుకోవచ్చు. తిన్న వెంటనే నడవడం లేదా జాగింగ్ చేయడం మానుకోండి. ఇది కడుపు నొప్పికి కారణం కావచ్చు. ప్రారంభంలో, 5-6 నిమిషాలు సున్నితమైన వేగంతో నడవండి. కొన్ని రోజుల తర్వాత, మీరు మితమైన వేగంతో సమయాన్ని 10 నిమిషాలకు పెంచవచ్చు.

మీ భోజన విరామ సమయంలో కార్యాలయం వెలుపల నడవాలని మీకు అనిపించకపోతే, మీరు కార్యాలయ ఆవరణలో 10 నిమిషాల పాటు నడవవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News