శరీరంలో విటమిన్ సి లేదంటే అంతే సంగతులు.. అందుకే ఈ ఫుడ్స్ తప్పనిసరి..!
Vitamin C: విటమిన్ సి చాలా ముఖ్యమైన పోషకం. దీనిని హంగేరియన్ బయోకెమిస్ట్ ఆల్బర్ట్ స్జెంట్-గ్యోర్గి 1930లలో కనుగొన్నారు
Vitamin C: విటమిన్ సి చాలా ముఖ్యమైన పోషకం. దీనిని హంగేరియన్ బయోకెమిస్ట్ ఆల్బర్ట్ స్జెంట్-గ్యోర్గి 1930లలో కనుగొన్నారు. శరీరంలోని అనేక ప్రక్రియలను పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాల పునరుత్పత్తికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా లభించే కొన్ని పండ్లు, కూరగాయల గురించి తెలుసుకుందాం.
రెడ్ క్యాప్సికమ్: 1 కప్పు తరిగిన రెడ్ క్యాప్సికమ్‌లో 191 mg విటమిన్ సి ఉంటుంది. అలాగే 64.8 mg విటమిన్ సి పచ్చి మిరపకాయలో లభిస్తుంది.
ఆకూకూరలు: వీటిలో ఆకుకూరలు, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్, బ్రోకలీ ఉంటాయి. ఉదాహరణకు 1 కప్పు తరిగిన బ్రోకలీలో 81.2 mg విటమిన్ సి లభిస్తుంది.
బంగాళదుంపలు: 17.7 మి.గ్రా విటమిన్ సి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపలో లభిస్తుంది.
జామ: జామ చాలా సాధారణ పండు. దీని గుజ్జు గులాబీ, తెలుపు రంగులో ఉంటుంది. ఒక జామపండు తింటే 125 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది
స్ట్రాబెర్రీ: ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మీరు ఒక కప్పు స్ట్రాబెర్రీ ముక్కలు తింటే శరీరానికి 97.6 mg విటమిన్ సి లభిస్తుంది.
బొప్పాయి: దీనికి ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కప్పు తరిగిన బొప్పాయిని తింటే శరీరానికి 88.3 mg విటమిన్ సి లభిస్తుంది.
నారింజ: నారింజను విటమిన్ సి పవర్‌హౌస్ అంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక నారింజ పండు తినడం వల్ల 82.7 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది.
కివి: ఈ పండు చాలా చిన్నది. కానీ ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కివి తినడం ద్వారా మీరు 64 mg విటమిన్ సి పొందుతారు.
నిమ్మకాయ: నిమ్మరసం ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెబుతారు. ఒక నిమ్మకాయలో 34.4 mg విటమిన్ సి లభిస్తుంది.