Vitamin D: శాకాహారులు విటమిన్ డి కావాలంటే ఇవి తినాల్సిందే..!
Vitamin D: శాకాహారులు విటమిన్ డి కావాలంటే ఇవి తినాల్సిందే..!
Vitamin D: విటమిన్ డి మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన మూలకం. ఇది దంతాలను కూడా బలపరుస్తుంది. అయితే మాంసాహారంలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కానీ శాఖాహారులు విటమిన్ కావాలంటే కొన్ని ప్రత్యేక రకాలైన ఆహారాలని తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి లోపాన్ని సరిదిద్దుకవచ్చు. ఇది కాకుండా మీరు ప్రతిరోజూ అరగంట పాటు ఎండలో కూర్చోవాలి. ఎముకలు దృఢంగా ఉంటాయి. శాకాహారులు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు
పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు. అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి. అందుకే శాఖాహారులు పాలను డైట్‌లో చేర్చుకోవచ్చు.
పెరుగు
పాలతో చేసిన పెరుగు వేసవిలో ఉత్తమమైనది. పెరుగు తినడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ప్రొటీన్లు, క్యాలరీలు లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చవచ్చు.
పుట్టగొడుగు
పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి మూలం. మీరు సూప్, లేదా సలాడ్ రూపంలో వీటిని తీసుకోవచ్చు. దీని వల్ల శరీరంలో విటమిన్ డి, క్యాల్షియం లోపం ఉండదు.
ఆరెంజ్ జ్యూస్
విటమిన్ డి నారింజలో పుష్కలంగా లభిస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి, క్యాల్షియం లోటు భర్తీ అవుతుంది.