Olive Oil: ఈ నూనె వాడితే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువ..!

Olive Oil: ఈ నూనె వాడితే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువ..!

Update: 2022-07-13 09:30 GMT

Olive Oil: ఈ నూనె వాడితే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువ..!

Olive Oil: నేటి కాలంలో చాలామంది వంటనూనెల వల్ల స్థూలకాయానికి గురవుతున్నారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలని ఎదుర్కొంటున్నారు. అందుకే సరైన వంట నూనెని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఆలివ్ నూనెని వాడమని సలహా ఇస్తున్నారు. ఇందులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. ప్రతిరోజూ అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఆలివ్‌ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి మంటను తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఆలివ్ నూనె రక్తనాళాల పనితీరును, గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నూనెలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మెరుగైన లిపిడ్ ప్రొఫైల్‌లో సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది కాకుండా ఈ నూనె అధిక రక్తపోటుని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఆలివ్‌ నూనెని వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వంటలన్ని ఈ నూనెతో చేయాలి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఈ ఉంటుంది. ఈ నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది. అందుకే ఆలివ్‌ నూనెని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.

Tags:    

Similar News