Tulsi Leaves: తులసి ఆకులు ఈ వ్యాధులకి చక్కటి ఔషధం..అవేంటంటే..!

Tulsi Leaves: గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.

Update: 2022-08-24 12:30 GMT

Tulsi Leaves: తులసి ఆకులు ఈ వ్యాధులకి చక్కటి ఔషధం..అవేంటంటే..!

Tulsi Leaves: గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి మూడు వేవ్‌లు ముగిసాయి. దీనివల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నాలుగో వేవ్‌ మొదలైంది. ఈ వ్యాధి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తాకకుండా ఉండాలంటే కచ్చితంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఈ రోజు మనం తులసిలోని కొన్ని అరుదైన లక్షణాల గురించి తెలుసుకుందాం. మీరు మీ కుటుంబాన్ని కరోనా నుండి మాత్రమే కాకుండా ఇతర తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. తులసిలో ఉండే అరుదైన గుణాలు ఏంటో తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది

మీకు ఆకలి తక్కువగా అనిపిస్తే, జీర్ణశక్తి బలహీనంగా మారుతున్నట్లయితే తులసి ఆకులకు సంబంధించిన నివారణలను తీసుకోండి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో 4-5 తులసి ఆకులను కడిగి తినండి. ఇలా చేయడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆకలి పెరుగుతుంది. రక్తం శుభ్రంగా ఉంటుంది. ఈ రెమెడీతో మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

చెవి నొప్పి

తరచుగా చెవిలో నొప్పి లేదా చెవి దిగువ భాగంలో వాపు ఉన్న వ్యక్తులు తులసి ఆకులని తినాలి. 3-4 తులసి ఆకులను కొద్దిగా నీటితో వేడి చేయండి. తర్వాత ఆ నీటిని చెవిలో 2-2 చుక్కలు వేయండి. మీరు చెవి నొప్పి నుంచి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు. చెవి వెనుక భాగంలో వాపు ఉంటే తులసి ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్‌ను వాపు ఉన్న ప్రాంతంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

శరీరం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు తులసి ఆకులను తింటే చాలా మంచిది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి, జ్వరం, జలుబు, వికారం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. తులసిలో 2 రకాలు ఉంటాయి. అందులో ఒకటి రామ్ తులసి, మరొకటి శ్యామ్ తులసి. రామ్ తులసితో పోలిస్తే శ్యామ్ తులసి ఔషధ గుణాల పరంగా ఎక్కువ ప్రయోజనకరమైనది.

Tags:    

Similar News