Dandruff: చుండ్రును వదిలించుకోవాలని కష్ట పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే

* చుండ్రు అనేది ప్రతి వారినీ ఎదో సందర్భంలో పలకరిస్తుంది. అది అంత సులభంగా పోదు.

Update: 2021-09-10 12:00 GMT

చుండ్రును వదిలించుకోవాలని కష్ట పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే 

Dandruff: చుండ్రు అనేది ప్రతి వారినీ ఎదో సందర్భంలో పలకరిస్తుంది. అది అంత సులభంగా పోదు. చుండ్రు చికిత్సకు మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ చుండ్రు సమస్య పోలేదు. కొన్ని రోజుల తర్వాత సమస్య తీవ్రమవుతుంది. చుండ్రు దురద ప్రమాదాన్ని పెంచుతుంది. చుండ్రును వదిలించుకోవడానికి ఈరోజు మేము మీకు కొన్ని హోం రెమెడీస్ చెప్పబోతున్నాం.

* కొబ్బరి నూనె

కొబ్బరి నూనె సహజంగా హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలపై ఫంగస్ వ్యాప్తిని నిరోధిస్తుంది. దీని కోసం మీరు నేరుగా మీ తలపై అప్లై చేయాలి. కొంత సమయం పాటు నూనెతో మసాజ్ చేయండి. దీంతో అది తలలోకి లోతుగా వెళ్తుంది. కొంత సమయం తర్వాత జుట్టును కడగాలి.

* వంట సోడా

చుండ్రు సమస్యను తొలగించడానికి బేకింగ్ సోడా ప్రయోజనకరం. ఇది మీ తలలోని అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. తద్వారా శిరోజాలు తడిగా ఉంటాయి. మూలికా షాంపూలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపడం ద్వారా చుండ్రును వదిలించుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి 2 నుండి 3 సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

* కలబంద

కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ స్కాల్ప్‌ని మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు అలోవెరా జెల్‌ని తలకు అప్లై చేయాలి. తర్వాత దానిని తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయండి.

* వేప

వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. చుండ్రు నిరోధక షాంపూలో వేప ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అదనంగా, వేప ఆకులను కొరికితే చుండ్రు తొలగిపోతుంది. అలాగే వేప ఆకులను పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేసి సుమారు 10 నుండి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను నిరోధిస్తుంది. దీని కోసం, మీరు ఆపిల్ సైడర్ అలాగే నీటిని సమాన నిష్పత్తిలో మిక్స్ చేసి తలకు అప్లై చేసి, సుమారు 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

Tags:    

Similar News