Herbal Teas: ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఈ హెర్బల్‌ టీలను ప్రయత్నించండి

* గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. * దాల్చినచెక్కను కలపడం వల్ల టీ రుచి

Update: 2021-11-23 08:32 GMT

ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఈ హెర్బల్‌ టీలను ప్రయత్నించండి(ఫైల్ ఫోటో)

Herbal Teas: కరోనా వల్ల జనాలకు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు కొంతమంది పని ఒత్తడి వల్ల ఆందోళనకు గురువుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే హెర్బల్‌ టీ అలవాటు చేసుకోవాలి. ఇవి శరీరంలో మెటబాలిజం పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని హెర్బల్ టీల గురించి తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జీవక్రియను పెంచడం, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, నరాలను శాంతింపజేయడం చేస్తుంది. ప్రధానంగా టీ ప్లాంట్‌లో ఉండే థియనైన్ అనే అమినో యాసిడ్ ఒత్తిడిని దూరం చేస్తుంది. జపాన్‌లోని ఓ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో గ్రీన్ టీ తాగే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని తేలింది.

2. తులసి టీ

తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలు, అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. తులసి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. తులసి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు.

3. అశ్వగంధ టీ

అశ్వగంధని శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ హెర్బ్ ఒక అడాప్టోజెన్ ఇది సహజ పదార్ధం. ఇది శరీరం ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని డికాక్షన్‌గా లేదా టీగా సులభంగా తీసుకోవచ్చు. హార్మోన్ల అసమతుల్యత తరచుగా మానసిక కల్లోలం, బరువు పెరుగుట, ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి అశ్వగంధ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అశ్వగంధలో ఒత్తిడి, ఆందోళనతో పోరాడే డి-స్ట్రెస్సింగ్ గుణాలు ఉంటాయి.

4. దాల్చిన చెక్క బ్లాక్ టీ

దాల్చిన చెక్క టీ మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక కప్పు టీలో దాల్చినచెక్కను కలపడం వల్ల టీ రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటుతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధం. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఒత్తిడిని దూరం చేస్తాయి.

Tags:    

Similar News