Radish: పోషకాల గని ముల్లంగి, దీనివల్ల కలిగే లాభాలెన్నో!
Radish: ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి
Radish Health Benefits: ముల్లంగి ఈ పేరు వినుంటారు.. కానీ దాని టేస్ట్ చేసిన వారు చాలా తక్కువనే చెప్పాలి. కొంత మంది ముల్లంగి అనగానే పారిపోతారు..కారణం దానిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. దాని గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. పోషకాల గని అని కూడా చెప్పవచ్చు. ముల్లంగి వల్ల కలిగే లాభాలేంటో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.
- ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అర్షమొలలు నివారణకు బాగా సహాయపడుతుంది. అర్షమొలలు అధికంగా కాకుండా నియంత్రిస్తుంది. ముల్లంగి కాలేయంను మంచి కండీషన్‌లో ఉంచుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగి ఆకులను కామెర్ల నివారణకు ఉపయోగపడుతాయి.
- ముల్లంగిని రోజు తీసుకోవడం వలన కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, ఓరల్ క్యాన్సర్‌లను రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్ శరీరంలో మూత్రం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
- శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
- ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ బి కాప్లెక్స్, జింక్ వంటివి చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముల్లంగిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మాన్ని అందంగా మార్చుతుంది.
- ముల్లంగి మూత్రపిండాల వ్యాధులను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడానికి రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతాయి. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతాయి.
- ముల్లంగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి త్రాగడం వల్ల జ్వరానికి కారణం అయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది. ముల్లంగి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళం మరియు ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు దగ్గు, అలెర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాలం బాగా పనిచేసేలా చేస్తుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి ముల్లంగి మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి మల విసర్జన సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్‌తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అలా ముల్లంగి బరువును నియంత్రిస్తుంది.
- ఈ ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును.
- పచ్చి ముల్లంగి దుంపలు లేదా దాని ఆకులను రసంగా చేసుకుని తీసుకుంటే విరేచననాలకు మంచిగా ఉపయోగపడుతుంది.
- ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును.
- ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొద్దిగా ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి.
- విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారికి ముల్లంగి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
- మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి ఎంతో దోహదపడుతుంది. ఈ ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అస్సలు రాళ్లు ఏర్పడే అవకాశామే ఉండదు.
- ఈ ముల్లంగి రసంలో కొద్దిగా నువ్వుల నూనెను కలుపుకుని వడబోసి ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ ముల్లంగి నూనె మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.