మెదడు, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాయ రసం తాగాల్సిందే..!

Pumpkin Juice: తెల్ల గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పెద్ద మొత్తంలో ఉంటాయి.

Update: 2022-06-17 13:00 GMT

మెదడు, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాయ రసం తాగాల్సిందే..!

Pumpkin Juice: తెల్ల గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పెద్ద మొత్తంలో ఉంటాయి. దీని వల్ల మీకు అధిక ప్రయోజనాలు లభిస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం సమస్యలు ఏర్పడుతాయి. మరికొంతమంది పిల్లలకు చిన్నతనంలో సరైన పోషకాహారం అందదు. దీనివల్ల మెదడు ఎదుగుదల ఆగిపోతుంది. తెల్ల గుమ్మడికాయ ఇలాంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.

తెల్ల గుమ్మడి రసం చేయడానికి ముందుగా గుమ్మడికాయను పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత గ్రైండర్లో వేసి బాగా జ్యూస్ చేయాలి. దీనిని వడగట్టి తాగితే ఆరోగ్యానికి అన్ని విధాల శ్రేయస్కరం. కాలేయంలో వేడి పెరిగినప్పుడు, కడుపులో మంట, చర్మంపై మంట, ఛాతీలో మంట మొదలవుతాయి. దీని కారణంగా మన శరీరం, ముఖంపై మొటిమలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఈ సమయంలో తెల్ల గుమ్మడికాయ రసం ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం.

బాల్యంలో సరైన పోషకాహారం అందనివారికి మెదడు సరిగ్గా ఎదగదు. అంతేకాదు వయసు పెరిగే కొద్దీ మైగ్రేన్ పేషెంట్లుగా మారతారు. మరికొందరు ఒత్తిడితో కూడిన జీవితం నుంచి డిప్రెషన్‌లోకి వెళతారు.. ఈ పరిస్థితిలో మీరు ఉదయాన్నే తెల్ల గుమ్మడికాయ రసాన్ని తాగితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Tags:    

Similar News