Heart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే..!
Heart Attack: ఈ రోజుల్లో పెరిగిన కొలస్ట్రాల్ వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు.
Heart Attack: ఈ రోజుల్లో పెరిగిన కొలస్ట్రాల్ వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. అందుకే కొలస్ట్రాల్‌ని సక్రమంగా ఉంచుకోవడం అవసరం. అందుకే సరైన డైట్ మెయింటెన్ చేయాలి. ఒమేగా 3, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్, రిచ్ విటమిన్లు, ఫైటోకెమికల్‌లు సమృద్ధిగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.
పండ్లు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి అన్ని రకాల బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరెంజ్, ద్రాక్ష, కాఫీ, డార్క్ చాక్లెట్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, బచ్చలికూరలో కూడా సమృద్దిగా ఉంటాయి. అందుకే వీటిని డైట్లో చేర్చుకోవాలి.
విటమిన్లు: విటమిన్ B కోసం పాల ఉత్పత్తులు, జున్ను తీసుకోవాలి. విటమిన్ ఏ బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపలలో లభిస్తుంది. విటమిన్ సి నారింజ, నిమ్మకాయలు, సీజనల్ పండ్లలో లభిస్తుంది. విటమిన్ డి పాలు, తృణధాన్యాలు, చేపలలో లభిస్తుంది. విటమిన్ E తృణధాన్యాలు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్‌లో లభిస్తుంది. ఇవన్నీ డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి.
ఒమేగా 3: ఒమేగా 3 మంచి కొవ్వుని సృష్టిస్తుంది. ఇది చేపలు, అవిసె గింజలలో ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 సోయాబీన్ ఉత్పత్తులలో ఉంటుంది. ఇది గుండెతో పాటు ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
కూరగాయలు: పండ్లు, కూరగాయలలో పైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆహారంలో రంగురంగుల కూరగాయలు, పండ్లు తినాలి. ఎరుపు, పసుపు క్యాప్సికమ్, బ్రోకలీ, బీట్‌రూట్, వంకాయ, క్యారెట్ అన్నీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దెబ్బతిన్న కణాలను సరిచేస్తుంది.