Thyroid Patients: థైరాయిడ్ పేషెంట్లు వీటి జోలికి పోవద్దు.. లేదంటే చాలా బాధపడుతారు..!
Thyroid Patients: ఆధునిక జీవితంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతున్నారు.
Thyroid Patients: ఆధునిక జీవితంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. అందులో థైరాయిడ్ సమస్య అన్నిటికంటే ముందు వరుసలో ఉంది. ఈ వ్యాధికి గురైనవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలకి దూరంగా ఉండాలి. సరైన డైట్ పాటించాలి. సమస్యని పెంచే ఆహారాలు తినకూడదు. థైరాయిడ్ వచ్చిందంటే ఎలాంటి ఆహారాలకి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.
తక్కువ గ్లూటెన్ ఆహారాలు
థైరాయిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి తక్కువ గ్లూటెన్ ఉన్న ఆహారాలని తీసుకోవాలి. ఎందుకంటే గ్లూటెన్ అనేది అధిక ప్రోటీన్ ఇది శరీరంలో ఊబకాయం, మధుమేహం, అధిక బిపికి కారణం అవుతుంది. బార్లీ, గోధుమలు, పిండి, వోట్స్, తృణధాన్యాల నుంచి ఎక్కువగా గ్లూటెన్ లభిస్తుంది. వీటిని ఆహారం నుంచి పూర్తిగా మినహాయించడం కొంచెం కష్టం. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
ఫాస్ట్ ఫుడ్ తినవద్దు
థైరాయిడ్ ఉన్నప్పుడు ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ రకమైన ఆహారంలో అయోడిన్ ఉండదు. దీంతో థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఫాస్ట్‌ఫుడ్ ఆహారాలని అవైడ్ చేయాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు తినవద్దు
థైరాయిడ్ సమస్యతో పోరాడుతున్నట్లయితే ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఆహారాలలో ఉప్పు ఎక్కువగా వాడుతారు. దీనివల్ల థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసుకోండి.
సహజసిద్దమైన కూరగాయలు
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు సహజసిద్దమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లని డైట్‌లో చేర్చుకోవాలి. వీటివల్ల సమస్య తొలగిపోతుంది. వైద్యుడు సూచించిన మందులని క్రమం తప్పకుండా వాడాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా నష్టమే. కాబట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవాలని గుర్తుంచుకోండి.