Thyroid: థైరాయిడ్‌ రోగులు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి..!

Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు రోగి బరువు వేగంగా పెరుగుతుంది.

Update: 2022-07-23 15:45 GMT

Thyroid: థైరాయిడ్‌ రోగులు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి..!

Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు రోగి బరువు వేగంగా పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయి బాగా తగ్గుతుంది. దీని కారణంగా శరీరం కేలరీలను బర్న్ చేయలేకపోతుంది. అందువల్ల రోగుల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అయితే థైరాయిడ్ రోగులు బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు తప్పులు చేస్తారు. థైరాయిడ్ సమస్య బారిన పడి బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గించే చిట్కాలు

1. థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గేటప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి.అలాంటి ఆహారాలు శరీరంలో గ్లూకోజ్ పరిమాణాన్ని పెంచుతాయి. దీనివల్ల కొవ్వు పెరుగుతుంది. అందుకే థైరాయిడ్‌ రోగులు తెల్ల రొట్టె, మైదా, కేకులు మొదలైన వాటిని తినకూడదు.

2. బరువు తగ్గుతున్నప్పుడు అధిక ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తగ్గించవద్దు. దీనివల్ల శరీరంలో అనేక సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

3. థైరాయిడ్ సమస్యలో రోగులు శరీరంలో నీటి కొరత ఉండకూడదు. ఈ సమయంలో వీరు తగినంత నీరు తాగాలి.

4. బరువు తగ్గేటప్పుడు రోగులు ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదు. తగినంత నిద్ర పోవాలి.

Tags:    

Similar News