Helmet: హెల్మెట్‌ ధరించే వారు కచ్చితంగా ఈ పని చేయండి.. లేదంటే చాలా కోల్పోతారు..!

Helmet: ద్విచక్ర వాహనం నడపాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

Update: 2022-08-14 09:15 GMT

Helmet: హెల్మెట్‌ ధరించే వారు కచ్చితంగా ఈ పని చేయండి.. లేదంటే చాలా కోల్పోతారు..!

Helmet: ద్విచక్ర వాహనం నడపాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇది మిమ్మల్ని రక్షించడమే కాకుండా ఫైన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే చాలామంది హెల్మెట్ ధరించేవారిని అడిగితే జుట్టు సమస్యగా మారుతోందని చెబుతున్నారు. నిజానికి హెల్మెట్ ధరించడం వల్ల హెయిర్ స్టైల్ పాడవడమే కాకుండా జుట్టు రాలిపోయే సమస్య మొదలవుతుంది. ఎక్కువ సేపు హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

బట్టతలగా ప్రమాదం

నిజానికి హెల్మెట్ ఎక్కువ సేపు ధరించడం జుట్టుకు ప్రమాదకరం. ఇది మీ తలలో చెమటను కలిగిస్తుంది. చెమట, ధూళి జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. మీరు ఈ రకమైన నష్టాన్ని నివారించాలంటే కింద పేర్కొన్న కొన్ని చిట్కాలను అనుసరించండి.

1. హెల్మెట్ ధరించడం వల్ల తలలో చెమట పడుతుంది. దీని కారణంగా హెల్మెట్ లోపలి పొర తడిగా మారుతుంది. హెల్మెట్‌ డ్యామేజ్ కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

2. హెల్మెట్‌ను శుభ్రమైన, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. తద్వారా అది సులభంగా ఆరిపోతుంది

3. ఎక్కువ సేపు ప్రయాణం చేస్తుంటే మధ్యమధ్యలో విరామం తీసుకుని హెల్మెట్ తీయడం మంచిది. మీ జుట్టు, హెల్మెట్ పొడిగా ఉండటానికి కొంత సమయం ఇచ్చినట్లవుతుంది.

4. తలపై కాటన్ క్లాత్ కట్టుకోవడం ఉత్తమ మార్గం. హెల్మెట్ ధరించే ముందు మీ తలపై క్లాత్‌ ధరించడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News