Cracked Feet: పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..
Cracked Feet: చలికాలంలో చాలామంది పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతుంటారు.
Cracked Feet: చలికాలంలో చాలామంది పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతుంటారు. అయినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. దీంతో అవి మరింత దారుణంగా తయారవుతాయి. ఈ పరిస్థితిలో మీ పాదాలు అంద విహీనంగా తయారవుతాయి. మీ మడమలు మురికి నేలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మడమలు లోతుగా పగిలితే చాలా బాధపెడుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పగుళ్లు రాకముందే కొన్ని చర్యలు తీసుకోవడం మంచిది. కొన్ని హోం రెమెడీస్‌ని పాటించడం ద్వారా వాటిని మునుపటిలా చేయవచ్చు.
కొబ్బరి నూనె
మనం తరచుగా జుట్టుకు కొబ్బరి నూనె ఉపయోగిస్తాం కానీ మడమల పగుళ్లను నయం చేయడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. ఇది మడమలను తేమగా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.
అరటిపండు
అరటిపండు మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. 2 పండిన అరటిపండ్లను గుజ్జులా చేసి పేస్ట్‌లా చేసి పాదాల మడమల మీద 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆ తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో మడమలు 2 వారాల్లో మునుపటిలా మారుతాయి.
గోరువెచ్చని నీరు
మీ చీలమండల పగుళ్లను సరిచేయడానికి పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు 20 నిమిషాలు ముంచి, మడమలను స్క్రబ్బర్‌తో రుద్దాలి. దానిలో ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించాలి. తర్వాత పాదాలపై ఆవాల నూనెను అప్లై చేసి ఆపై సాక్స్ ధరించండి. మీ మడమలు కొన్ని రోజుల్లో మునుపటిలా మారుతాయి.