Wrinkles: ముఖంపై ముడతలు రావొద్దంటే ఈ పోషకాహారం తప్పనిసరి.. అవేంటంటే..?

Wrinkles: ముఖంపై ముడతలు రావొద్దంటే ఈ పోషకాహారం తప్పనిసరి.. అవేంటంటే..?

Update: 2022-02-07 07:30 GMT

Wrinkles: ముఖంపై ముడతలు రావొద్దంటే ఈ పోషకాహారం తప్పనిసరి.. అవేంటంటే..?

Wrinkles: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పుల వల్ల ముప్పై ఏళ్లు దాటాయంటే చాలు ముఖం ముడతలు పడటం ప్రారంభమవుతుంది. మహిళలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు నలుగురిలో రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫంక్షన్లు, వేడుకలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ అన్నీ వాడుతున్నారు కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీనికి పరిష్కారం పోషకాహారం తీసుకోవడమే. చక్కటి తాజా ఆహారం తీసుకుంటే వెంటనే మీరు మామూలుగా మారిపోవచ్చు.

30 ఏళ్ల వయసులో ముఖంపై ముడతలు రాకూడదంటే పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. మంచి గ్లోని తీసుకొస్తుంది. తర్వాత చర్మంపై ముడతలు రావొద్దంటే విటమిన్‌ ఈ అవసరం. ఇది చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. మీకు నాన్‌వెజ్‌ అంటే ఇష్టం ఉంటే వారానికోసారి చేపలను తప్పకుండా తినాలి. వీటిని తినడం ద్వారా ముడతలు, ముఖంపై మచ్చలు కనిపించవు.

ఆవకాడో యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంపై కొత్త కణాలను సృష్టిస్తుంది. మెరుగైన చర్మం కోసం అవోకాడో మాస్క్‌ని అప్లై చేయవచ్చు. మంచి ఫలితాలను చూస్తారు. టమోటా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మ సంరక్షణలో ఉత్తమమైనదిగా చెబుతారు. ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడమే కాకుండా చర్మంపై రుద్దడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు ఏర్పడవు. 

Tags:    

Similar News