Immunity Power: కరోనాకు దివ్యౌషధం.. తిప్పతీగ!
Immunity Power: కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు.
Immunity Power: కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలపై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద డాక్టర్లు ఓ ఆకును సూచిస్తున్నారు. అదే తిప్పతీగ (Heart-leaved Moonseed). దీనిని గుడూచి, అమృత అని కూడా పిలుస్తారు. ఈ ఆకులో ఎన్నో వైద్య లక్షణాలు ఉన్నాయంట. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది.
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు మనని ఆరోగ్యంగా ఉంచేందుకు తిప్పతీగ ఎంతో సహాయపడుతుందంట. అందుకే తప్పకుండా దీనిని వాడాలని సూచిస్తున్నారు ఆయుర్వేద డాక్టర్లు. మరి ఎలా వాడాలో తెలుసుకుందాం.. తిప్పతీగ ఆకులను బాగా నూరి ముద్దలా చేసుకోవాలి. అలా చేసిన ముద్దను చిన్నసైజు గోళీలులా ఉండలు చేసుకోవాలి. ఈ గోళీలను పది రోజుల పాటు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మనలో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.
ఇప్పటికే ఆయుర్వేదంలో తిప్పతీగను ఉపయోగించి ఎన్నో మందలు తయారు చేశారంట. అలాగే తిప్పతీగను తీసుకోవడం వల్ల ఫీవర్ కూడా రాదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను 'శంశమినివటి' అనే పేరుతో మందుగా తయారు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు వెల్లడిస్తున్నారు.
ఇతర ఉపయోగాలు:
- తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేసి, శరరీంలోని కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. వ్యాధుల బారినపడకుండా కూడా కాపాడుతాయి.
- అజీర్తి సమస్యతో కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంది.
- తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. దీనిలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
- దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు దీనిలో ఉన్నాయి.
- ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు. కీళ్లనొప్పులను కూడా నయం చేస్తుంది.
- తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.