Womens Health: మహిళలకి ఈ విటమిన్లు అత్యవసరం..ఎందుకంటే..?
Womens Health: స్త్రీల శరీరం పురుషుల శరీరం కంటే భిన్నంగా స్పందిస్తుంది. అందుకే మహిళల శరీరానికి పోషకాల అవసరం చాలా ఉంటుంది.
Womens Health: స్త్రీల శరీరం పురుషుల శరీరం కంటే భిన్నంగా స్పందిస్తుంది. అందుకే మహిళల శరీరానికి పోషకాల అవసరం చాలా ఉంటుంది. సాధారణంగా మహిళలు ఇళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని తింటారు. అందుకే తరచూ జబ్బు పడుతారు. కాబట్టి మహిళలు ఆరోగ్యకరమైన,తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి. మహిళల ఎదుగుదలకు,మెరుగైన ఆరోగ్యానికి కొన్ని కొన్ని ముఖ్యమైన విటమిన్లు అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.
1.విటమిన్ ఎ
స్త్రీకి 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మెనోపాజ్ దశ ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. విటమిన్ ఎ సహాయంతో ఆ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం క్యారెట్, పాలకూర, గుమ్మడి గింజలు, బొప్పాయి తినాలి.
2.విటమిన్ B9
గర్భిణీ స్త్రీలకు విటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన పోషకం. వారి శరీరంలో ఈ పోషకం లోపం ఉంటే పిల్లలకి లోపాల సమస్య ఉంటుంది. దీని కోసం రోజువారీ ఆహారంలో ఈస్ట్, బీన్స్, ధాన్యాలను చేర్చుకోవాలి.
3.విటమిన్ డి
విటమిన్ డి వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. కాబట్టి కాల్షియంతో పాటు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజంతా ఎండలో 15 నుంచి 30 నిమిషాలు గడపడంతోపాటు పాలు, చీజ్,పుట్టగొడుగులు,కొవ్వు చేపలు,గుడ్లు వంటి వాటిని తినాలి.
4. విటమిన్ ఇ
విటమిన్ ఈ మహిళలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని వల్ల చర్మం, జుట్టు,గోర్లు అందంగా కనిపిస్తాయి. దీంతో పాటు మచ్చలు, ముడతలు మాయమవుతాయి.ఇందుకోసం వేరుశెనగ,బాదం,పాలకూర వంటి ఆహార పదార్థాలను తినాలి.