Vegetables: కొంచెం ఈ కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్త..!

Vegetables: నేటి రోజుల్లో చాలామంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అనేక ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు.

Update: 2022-08-23 01:30 GMT

Vegetables: కొంచెం ఈ కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్త..!

Vegetables: నేటి రోజుల్లో చాలామంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అనేక ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. కూరగాయల వినియోగం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా వరకు నిజం. కానీ కొన్ని కూరగాయలని జాగ్రత్తగా తినాలి. లేదంటే బాధపడవలసి ఉంటుంది. అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం.

1.క్యాబేజి

క్యాబేజిని ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కొందరికి ఈ కూరగాయ తినడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు ఎదురవుతాయి. క్యాబేజీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. క్యాబేజిని పచ్చిగా తినకూడదు. మీకు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

2.మష్రూమ్

మష్రూమ్ ఖరీదైన ఆహారం దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది విటమిన్ డి గొప్ప మూలంగా చెబుతారు. అయితే ఎవరికైనా అలెర్జీ సమస్య ఉంటే వీటిని తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది. దీని కోసం మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

3.క్యారెట్

మీరు క్యారెట్ తినే ఉంటారు ఇందులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కానీ మీరు దీన్ని పచ్చిగా తింటే మంచిది. అయితే చాలా మంది ఆరోగ్య నిపుణులు క్యారెట్‌లను పరిమిత పరిమాణంలో తీసుకోవాలని చెబుతారు. ఎందుకంటే ఇందులో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుంది.

4.బీట్‌రూట్‌

బీట్‌రూట్‌ పోషకాల నిధి. దీనిని ఎక్కువగా సలాడ్, జ్యూస్ రూపంలో వినియోగిస్తారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీరు బీట్‌రూట్‌ను అవసరమైన దానికంటే ఎక్కువగా తింటే మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చు కానీ పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిది.

Tags:    

Similar News