Vegetables: ఈ కూరగాయలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!
Vegetables: ఈ కూరగాయలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!
Vegetables: పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు సమతుల్య ఆహారం కోసం కొన్నికూరగాయలని డైట్‌లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బంగాళాదుంప, సోయాబీన్, నువ్వులు, టొమాటో, ఉల్లిపాయలు, బ్రోకలీ వంటి అనేక కూరగాయలు గుండెపోటును నివారించడానికి సహాయం చేస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్లు, అవసరమైన పోషకాలు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావిస్తారు. ఎందుకంటే చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గొప్ప మూలం. ఇవి గుండెను రక్షించడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
చేపల ద్వారా ఫ్యాటీ యాసిడ్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ ఆరోగ్యానికి ఉత్తమమైన చేపలు. అలాగే విటమిన్ సి, డి, ఈ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
ఇది కాకుండా మీరు వెజ్‌లో పుట్టగొడుగులను తినవచ్చు. ఇందులో మీకు విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. పచ్చి కూరగాయలు, బొప్పాయి, బచ్చలికూర, క్యాప్సికం మీకు విటమిన్-సి, ఈలను అందిస్తాయి.