Mosquito Repellents: దోమల అంతు చూసే సూపర్ టిప్స్..ఇవి ఫాలో అయితే దోమలన్నీ పరార్

Mosquito Repellents: వర్షాకాలం వచ్చిందంటే వర్షాలతోపాటు దోమలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే మనకు లభించే కొన్ని సహజ పదార్థాలతో దోమలను తరిమికొట్టవచ్చు. అవేంటో చూద్దాం.

Update: 2024-07-15 05:34 GMT

Mosquito Repellents: దోమల అంతు చూసే సూపర్ టిప్స్..ఇవి ఫాలో అయితే దోమలన్నీ పరార్

Mosquito Repellents:దోమలు...ఒక్కప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఉండేవి. తేమగా ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందేవి. కానీ ఇప్పుడు సీజన్లతో సంబంధం లేకుండా వ్యాప్తి చెందుతున్నాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు భారీ పెరుగుతోంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల సమస్యను తగ్గించుకోవచ్చు. సాధారణంగా దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, రిఫెలెంట్స్, స్ప్రేయింగ్ కెమికల్స్ వాడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ అనారోగ్యాలకు దారితీస్తాయి. అయితే మనకు సహాజంగా లభించే కొన్ని పదార్థాలతో దోమలను తరిమి కొట్టవచ్చు. కొన్ని రకాల నేచురల్ ప్రొడక్ట్స్ తో మంచి ఫలితాలు ఉంటాయి. అవి మీరూ ప్రయత్నించండి.

లెమన్ గ్రాస్:

ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ నుంచి వచ్చే వాసన దోమలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

వేప ఆకులు:

వేపాకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే కూడా దోమలు కుట్టవు.

కర్పూరం:

కర్పూరం వెదజల్లే సువాసనకు దోమలు పారిపోతాయి. దీన్ని పలు పద్ధతుల్లో ఉపయోగిస్తుంటారు. సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఘాటు వాసనకు దోమలు పారిపోతాయి. ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో పది నుంచి 15 కర్పూరం బిల్లలు వేసి ఇంట్లో ఓ మూలలో పెట్టండి. దోమల బెడద తగ్గుతుంది.

కొబ్బరినూనె, లవంగాలు:

దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.

టీ ట్రీ ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్ ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది. ఈ వాసన దోమలకు అస్సలు పడదు. ఈ ఆయిల్, ఇతర కీటకాలకు కూడా వికర్షిస్తుంది. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. దీంతో దోమల బెడద చాలా తగ్గుతుంద. దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.

Tags:    

Similar News