Spices Benefits: కూరలలో ఉపయోగించే ఈ సుగంధ ద్రవ్యాలు ఎన్నో వ్యాధులకు ఔషధాలు.. అవేంటంటే..?
Spices Benefits: మనం నిత్యజీవితంలో ఉపయోగించే చాలా ఆహార పదార్థాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Spices Benefits: మనం నిత్యజీవితంలో ఉపయోగించే చాలా ఆహార పదార్థాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందులో ముఖ్యమైనవి వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు. వీటిని ఎక్కువగా కూరలు వండేటప్పుడు వినియోగిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే సనాతన ఆయుర్వేదంలో వీటి గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఆయుర్వేదంలో వాడే మందులలో కూడా వీటిని విరివిగా వాడుతారు. కరోనా కాలంలో వీటి ప్రయోజనం గురించి చాలామందికి తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు అందరు వాడుతున్నారు. అవేంటో చూద్దాం.
ఈ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, పసుపు, అల్లం, మిరియాలు ఇంకా చాలా ఉంటాయి. ఇందులో ప్రధానమైనది అల్లం. ఆయుర్వేద చికిత్సలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఆహారంలో అల్లం చేర్చడమే కాకుండా అల్లంతో చేసిన టీని కూడా తాగవచ్చు.
దాల్చిన చెక్కలో యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. జలుబుకు కారణమయ్యే వైరస్‌తో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది గ్యాస్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇంగువ వాసన ఘాటుగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుంది. ఇందులోని గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉబ్బరం, అపానవాయువు, పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు, త్రేనుపులను తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది గ్యాస్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.