Health Tips: ఈ వ్యక్తులు నెయ్యి జోలికి వెళ్లకూడదు.. కారణం ఏంటంటే..?

Health Tips: పాల ఉత్పత్తిలో భారతదేశం ఎల్లప్పుడూ టాప్‌లో ఉంటుంది.

Update: 2022-12-10 06:43 GMT

Health Tips: ఈ వ్యక్తులు నెయ్యి జోలికి వెళ్లకూడదు.. కారణం ఏంటంటే..?

Health Tips: పాల ఉత్పత్తిలో భారతదేశం ఎల్లప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే గ్రామాల నుంచి నగరాల వరకు జంతు సంపద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ దేశీ నెయ్యి ఎక్కువగా తీసుకుంటారు. నెయ్యిని రోటీ, కిచడీ, పప్పు వంటి వాటికి రాసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని వంట నూనెకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించమని చెబుతారు. ఇది జుట్టు నుంచి చర్మం వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దీనికి సూపర్ ఫుడ్ అని పేరు.

అయితే దేశీ నెయ్యి పరిమిత పరిమాణంలో తినాలి. ఇది అందరికీ ప్రయోజనకరమైనది కాదు. దేశీ నెయ్యి వినియోగం కొంతమందికి హానికరం. మీరు 8 నుంచి 10 గంటలు కార్యాలయంలో కూర్చొని పని చేస్తే శారీరక శ్రమ చేయకపోతే వారు దేశీ నెయ్యి తీసుకోకూడదు. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే దేశీ నెయ్యిని నివారించండి. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

ఎక్కువ గంటలు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసే వారికి నెయ్యి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పరుగెత్తాల్సిన అవసరం ఎక్కువగా ఉండే వ్యక్తులు దేశీ నెయ్యి తీసుకుంటే చాలా మంచిది. సన్నగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగాలనుకునే నెయ్యి తీసుకుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఊబకాయం ఉన్నవారు నెయ్యి జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News