Hair Growth: జుట్టు పెరుగుదల కోసం ఈ గింజలు తినాల్సిందే..!
Hair Growth: జుట్టు పెరుగుదల కోసం ఈ గింజలు తినాల్సిందే..!
Hair Growth: ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిలో సర్వసాధారణమైంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ జుట్టు రాలడం ఆగడంలేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఆహారంలో కొన్ని పోషక విలువలు ఉన్న గింజలను చేర్చుకోవాలి. ఇది తక్షణ ప్రయోజనాలను అందిస్తుంది.
గుమ్మడి గింజలు, మెంతి గింజలు జుట్టు పెరుగుదలకు సహాయపడే వాటిలో ముందు వరుసలో ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి జీవనశైలిని నిర్వహించడం చేయాలి. మీరు జుట్టు వేగంగా పెరగాలని కోరుకుంటే ఆహారంలో కొన్ని పోషక విలువలు అధికంగా ఉండే విత్తనాలను పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవాలి. నువ్వులు జుట్టు పెరుగుదలని పెంచుతాయి. వీటిని కూరగాయలో లేదా మరేదైనా ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
పొద్దుతిరుగుడు గింజలు జుట్టు పెరుగుదలకి సహాయం చేస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో యాంటీఆక్సిడెంట్ విటమిన్ ఈని ప్రోత్సహించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజలు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. వీటిలో జింక్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎ, బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతి గింజల గురించి చాలా మందికి తెలుసు. కానీ ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీ ఆహారంలో మెంతులు ఉపయోగించడానికి ప్రయత్నించండి.