Health Tips: ఈ సహజ పానీయాలు చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!

Health Tips: అధిక కొలెస్ట్రాల్ శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది.

Update: 2023-04-03 12:30 GMT

Health Tips: ఈ సహజ పానీయాలు చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!

Health Tips: అధిక కొలెస్ట్రాల్ శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది జరుగుతుంది. ఆహారంలో ఎక్కువ ఆయిల్, స్పైసీ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో అధిక బీపీ, గుండెపోటు, కరోనరీ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే కొన్ని సహజ పానీయాలు తాగడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ఓట్స్ పానీయం

వోట్స్‌ని తరచుగా ఉదయంపూట టిఫిన్‌గా తింటారు. ఇందులో బీటా గ్లూటెన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ధమనులలో ఉండే అడ్డంకులని తొలగిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు ఓట్స్ డ్రింక్ తాగితే అది శరీర అవసరాలకు అనుగుణంగా సరిపోతుంది.

బెర్రీస్ జ్యూస్‌

బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి అనేక పండ్లు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ బెర్రీస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

టొమాటో జ్యూస్

టొమాటోని ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో లైకోపీన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కూరగాయలలో నియాసిన్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. దీనికి కారణం ఇందులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం బాగా తగ్గుతుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.

Tags:    

Similar News