Health Tips: కంటి అలసటతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!

Health Tips: కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంది...

Update: 2022-01-11 04:21 GMT

Health Tips: కంటి అలసటతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!

Health Tips: కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్క్రీన్‌పై గంటల తరబడి గడిపే విధానం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా కంటి సమస్యను కూడా పెంచుతోంది. ఈ రోజుల్లో కంప్యూట‌ర్‌పై నిరంతరంగా వర్క్‌ చేయడం వల్ల కంటిచూపు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కళ్లపై టెన్షన్ ఉన్నప్పుడు అలసటగా మారుతుందని, ఆ తర్వాత మంట, నొప్పి, చూపు కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, మీకోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. వీటి ద్వారా మీరు కంటి అలసట నుంచి బయటపడవచ్చు.

ఆరో నీళ్లు కళ్లకు మంచిది - మీకు కంటిలో నొప్పిగా అనిపిస్తే, ఆరో నీటిని వేడి చేసి అందులో దూదిని నానబెట్టండి. అనంతరం ఈ నీటిలోని దూదిని తీసి కళ్లకు పట్టించాలి. కావాలంటే కళ్లపై కాసేపు కూడా ఉంచుకోవచ్చు. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది.

డ్రై ఐస్ సమస్య - ఈ రోజుల్లో కళ్లపై ఒత్తిడిని నివారించడానికి కంప్యూటర్లు లేదా ఇతర గాడ్జెట్‌లలో డార్క్ మోడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో అప్పుడప్పుడు కంటి రెప్పవేయకపోయినా, కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.అందుకే కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కొంత సమయం విరామం తీసుకోవాలి. మరోవైపు, మీ కళ్ళు పొడిగా ఉంటే, కంటి చుక్కలను ఉపయోగించడం మంచింది.

కళ్లకు ఐస్ అప్లై చేయండి - చాలా మంది కళ్ల అలసటను పోగొట్టడానికి చల్లని నీళ్లతో కళ్లను కడుగుతుంటారు. ఇది మంచిదే. అయితే కళ్లపై నేరుగా ఐస్‌ను పెట్టకూడదు. ఏదైనా క్లాత్‌లో తీసుకుని కంటి రెప్పలు మూసి ఐస్‌ను పెట్టుకోవచ్చు.

Tags:    

Similar News