Papaya Seeds: బొప్పాయి గింజలతో ఈ వ్యాధులకి చెక్.. అస్సలు పారేయవద్దు..!
Papaya Seeds: బొప్పాయి అద్భుతమైన పండు. ఇది అన్ని సీజన్‌లలో లభిస్తుంది.
Papaya Seeds: బొప్పాయి అద్భుతమైన పండు. ఇది అన్ని సీజన్‌లలో లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని పేదలపండుగా కూడా చెబుతారు. అయితే ఈ పండుని కోసినప్పుడు అందులో నల్లటి గింజలు ఉంటాయి. వీటిని పనికిరానివని భావించి బయట పారేస్తాము. కానీ ఈ విత్తనాల వల్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అది ఏ విధంగా అనేది ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
1. జలుబు, ఫ్లూ నివారణ
బొప్పాయి గింజలలోని పాలీఫెనాల్స్, ఫ్లేవలోయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జలుబు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
2. కొలెస్ట్రాల్ తగ్గుదల
బొప్పాయి గింజలలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ధమనులలో ప్లేక్ తగ్గినప్పుడు రక్తపోటు తగ్గుతుంది. వీటితో గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి గుండె జబ్బులను నివారించవచ్చు.
3. బరువు తగ్గుదల
బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే స్థూలకాయానికి గురికాకుండా పెరుగుతున్న బరువు కూడా తగ్గించుకోవచ్చు.
4. బొప్పాయి గింజలను ఎలా తినాలి ..?
బొప్పాయి గింజలని ఎలా తినాలి అనేది ఇప్పుడు తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న. దీని కోసం ముందుగా ఈ విత్తనాలను నీటితో కడగాలి. ఆపై వాటిని చాలా రోజులు ఎండలో ఆరబెట్టాలి. గ్రైండ్ చేసి పొడి ఆకారంలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని వివిధ రకాల ఆహారపదార్థాలలో కలుపుకొని తినవచ్చు. దీని రుచి చేదుగా ఉంటుంది కాబట్టి తీపి పదార్థాలతో కలిపి తినడం మంచిది.