Daily Habits: ఈ అలవాట్లు సులువుగా బరువు తగ్గిస్తాయి.. అవేంటంటే..?
Daily Habits: ఈ అలవాట్లు సులువుగా బరువు తగ్గిస్తాయి.. అవేంటంటే..?
Daily Habits: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. బరువు పెరిగితే దాన్ని తగ్గించడం చాలా కష్టం. దీనికి కఠినమైన ఆహారం, భారీ వ్యాయామాలు అవసరం. అయినప్పటికీ చాలామంది స్లిమ్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అలాగే నూనె, తీపి ఆహారం ఎక్కువగా తినడం. అయితే సులువుగా బరువు తగ్గే చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి
ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. ఈ రోజు నుంచే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ 2 కప్పుల గోరువెచ్చని నీటిని తాగితే శరీరం ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. తేనెతో కలిపిన గోరువెచ్చని నీటిని కూడా తాగవచ్చు. ఇది బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గం.
2. అల్పాహారం
బరువు తగ్గాలంటే టిఫిన్‌లో ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఈ జాబితాలో గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల సూప్స్ చేర్చవచ్చు.
3. వర్కవుట్స్
బరువు తగ్గడానికి శారీరకంగా చురుకుగా ఉండటం అవసరం. ప్రతిరోజు వర్కవుట్స్ తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల నడుము, పొత్తికడుపు చుట్టూ కొవ్వు తగ్గుతుంది. అందుకే ఉదయం లేవగానే పరుగు, జాగింగ్, యోగా, జిమ్ చేయడం ముఖ్యం. వ్యాయామం ద్వారా జీవక్రియను పెంచవచ్చు, వ్యాధులను నివారించవచ్చు.
4. శరీరంలో నీటి కొరత
శరీరంలో నీటి కొరత ఉంటే అది మన జీవక్రియను ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఎక్కువ భాగం నీటితో ఉంటుంది. కాబట్టి శరీరం హైడ్రేట్ కాకపోతే పనితీరులో సమస్యలు ఉంటాయి. అదే సమయంలో బరువు తగ్గడం అంత సులభం కాదు.