Kidneys Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.. లేదంటే అంతే సంగతులు..!

Kidneys Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.. లేదంటే అంతే సంగతులు..!

Update: 2023-03-05 15:30 GMT

Kidneys Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.. లేదంటే అంతే సంగతులు..!

Kidneys Health: కిడ్నీలో సమస్య ఎదురైనప్పుడే దాని విలువ అందరికి తెలుస్తుంది. ఈ అవయవం ప్రధాన విధి ఫిల్టర్ చేయడం. తద్వారా విష పదార్థాలు బయటకు వెళుతాయి. దీంతో అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉంటాం. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆమ్లత్వం, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలను సురక్షితంగా ఉంచుకోవాలంటే కొన్ని అలవాట్లని అనుసరించాలి.

ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం

కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముందుగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటిని డైలీ డైట్ నుంచి మినహాయించాలి. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలు, ప్రోటీన్ ఆహారం, తృణధాన్యాలు, ఫైబర్ ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

మద్యపానం మానేయాలి

మద్యపానం ఒక సామాజిక దురాచారం మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు. నేటి యుగంలో చిన్న నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు మద్యానికి బానిసలుగా మారారు. ఇది మూత్రపిండాలని మాత్రమే కాదు అన్ని అవయవాలని దెబ్బతీస్తుంది. మొత్తం శరీరాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తుంది. వీలైనంత త్వరగా ఈ అలవాటుని మానేస్తే మంచిది.

తగినంత నీరు తాగడం

చాలా మంది వైద్యులు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలని చెబుతారు. కావాలంటే నిమ్మరసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసం, కూరగాయల రసం తాగవచ్చు.

ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం

మన ఆరోగ్యానికి ఉప్పు చాలా అవసరం. కానీ ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ఎందుకంటే సోడియం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఇది రక్తపోటును పెంచుతుంది. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

టీ, కాఫీని తగ్గించడం

భారతదేశంలో టీ, కాఫీ ప్రియులకు కొరత లేదు. ఈ పానీయాలలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది.

Tags:    

Similar News