Kidney Failure: కిడ్నీ ఫెయిల్యూర్‌కి ఈ అలవాట్లే కారణం.. అవేంటంటే..?
Kidney Failure: కిడ్నీలు మన శరీరంలో చాలా ప్రధానమైన అవయవాలు.
Kidney Failure: కిడ్నీలు మన శరీరంలో చాలా ప్రధానమైన అవయవాలు. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కిడ్నీలు పనిచేస్తాయి. ఇవి సరిగ్గా పని చేయకపోతే అనేక వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. కిడ్నీ సమస్యలకు సరైన సమయంలో చికిత్స అందకపోతే మనిషి ప్రాణం కూడా పోతుంది. ఈ రోజు మనం మూత్రపిండాల వైఫల్యానికి కారణాలు, నివారణ గురించి తెలుసుకుందాం.
రెండు కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్
రెండు కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మొదటిది తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం రెండవది దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం. తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంలో కిడ్నీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతుంది. ఈ సమస్యలో కిడ్నీ మార్పిడి, డయాలసిస్ అవసరం లేదు. అదే దీర్ఘకాలిక స్థితిలో మూత్రపిండాల పరిస్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది.
మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు
మీ శరీరంలో కిడ్నీ సరిగా పని చేయకపోతే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. తక్కువ మూత్ర విసర్జన, మూత్రంతో రక్తస్రావం, శ్వాస ఆడకపోవుట, చాలా అలసటగా అనిపించడం, వికారం, ఛాతీ నొప్పి, ఒత్తిడి భావన, గుండెపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది..
చాలా మంది పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వైద్యులను సంప్రదించకుండా తీసుకుంటారు. ఇది కిడ్నీ దెబ్బతినడానికి కారణం అవుతుంది. చెడు జీవనశైలి, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చు. మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి కనీసం సంవత్సరానికి ఒకసారి మూత్రం, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారం తీసుకోవాలి. ఇది కాకుండా తగినంత నీరు త్రాగాలి.