Health Tips: ఈ పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమే.. కానీ అతిగా తింటే అనర్థాలే..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి.

Update: 2022-09-02 09:52 GMT

Health Tips: ఈ పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమే.. కానీ అతిగా తింటే అనర్థాలే..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతాయి. కానీ ఏదైనా అతిగా తింటే అనర్థాలకి దారితీస్తుంది. ప్రతి ఆహారానికి నిర్ణీత పరిమితి ఉంటుంది. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు. అలాగే కొన్ని పండ్లు, కూరగాయలని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

1. ఆరెంజ్

ఆరెంజ్‌ చాలా మంచి పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే పరిమితికి మించి తీసుకుంటే మూత్రం రంగు మారుతుంది. దాహం వేసినప్పుడు ఆరెంజ్ జ్యూస్ కన్నా నీళ్లు తాగడమే మంచిది.

2. క్యారెట్

క్యారెట్‌ నేల లోపల లభించే కూరగాయ. ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని సాధారణంగా సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కానీ అధిక వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కారణంగా చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

3. క్యాబేజి

క్యాబేజి పరిమితంగా తీసుకుంటే మంచిదే. కానీ ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ఇందులో రిఫ్నోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కొంతమంది పచ్చిగా తింటారు కానీ ఇది వండినాక మాత్రమే తినాలి.

4. మష్రూమ్

మష్రూమ్ ఖరీదైన ఆహారం. ఆరోగ్య పరంగా ఇది చాలా మంచిది. విటమిన్ డి గొప్ప మూలం. కానీ పరిమిత పరిమాణంలో ఉడికించి తినాలి. లేదంటే అలెర్జీ ఏర్పడుతుంది.

Tags:    

Similar News