Four Habits: ఈ నాలుగు అలవాట్ల వల్లే ఆరోగ్యం పాడవుతుంది..! అవేంటంటే..
Four Habits: ఇంట్లో వండుకోవడం మానేసి బయటి ఆహారంపై ఎక్కువగా తినడంతో చిన్న వయసులోనే సమస్యలతో బాధపడుతున్నారు
Four Habits: ఆధునిక జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగులందరు ప్రకృతికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. తినే సమయంలో పడుకోవడం, పడుకునే సమయంలో తినడం చేస్తున్నారు. అంతేకాదు ఇంట్లో వండుకోవడం మానేసి బయటి ఆహారంపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ 4 అలవాట్లను మార్చుకుంటే జీవితంలో రోగాలు దరిచేరవు. అవేంటో తెలుసుకుందాం.
సరైన సమయంలో నిద్ర పోవాలి
ఈ రోజుల్లో చాలామంది పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లలో గడుపుతున్నారు. దీని కారణంగా నిద్ర దెబ్బతింటుంది. దీనివల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ప్రతి వ్యక్తి రోజూ కనీసం 7-8 గంటల నిద్ర పోవాలి. అప్పుడు శరీరం ఉత్తేజితంగా ఉంటుంది. ఏ పని అయినా ఆసక్తితో చేస్తాం.
వేడి నీరు తాగడం
ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత పరగడుపున గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ వేగంగా పెరుగుతుంది. కడుపు క్లియర్ అవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని విషపూరిత అంశాలు బయటకు వెళుతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.
వ్యాయామం
ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. యోగా ముఖ్యమైనది. వ్యాయామం మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుత రోజుల్లో అతి తక్కువ శారీరక శ్రమ వల్ల ఊబకాయం పెరుగుతుంది. దీని వల్ల అన్ని రోగాలు చుట్టుముడుతున్నాయి. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
పోషకాలు ఉన్న అల్పాహారం
ప్రతి ఒక్కరు ఉదయాన్నే మంచి టిఫిన్ చేయాలి. అందులో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రసం, పాలు, గుడ్డు, మొలకలు, ఉప్మా, సెమోలినా ఇడ్లీ, పోహా మొదలైన వాటిని అల్పాహారంగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.