Health Tips: గుండె ఆరోగ్యం కోసం ఈ అలవాట్లని వదిలేయాల్సిందే..!
Health Tips: గుండె జబ్బులు సాధారణంగా అధిక కొలెస్ట్రాల్‌తో మొదలవుతాయి
Health Tips: భారతదేశంలో హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోలేకపోవడమే దీనికి కారణం. గుండె జబ్బులు సాధారణంగా అధిక కొలెస్ట్రాల్‌తో మొదలవుతాయి. దీని కారణంగా సిరల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ సమస్యలు ఎదురవుతాయి. ఇవి చాలా ప్రాణాంతకం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లని వదిలేయాల్సిందే. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1. సిగరెట్లు, ఆల్కహాల్
సిగరెట్లు, ఆల్కహాల్ మన ఊపిరితిత్తులు, కాలేయాలను దెబ్బతీస్తాయని తరచుగా వింటూనే ఉంటాం. కానీ ఈ అలవాట్లు మన హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వీటి వల్ల హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ చెడు అలవాట్లను ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది
2. శీతల పానీయాలు
మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి తరచుగా శీతల పానీయాలు తీసుకుంటాం. కానీ ఇందులో సోడా పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె చాలా దెబ్బతింటుంది. దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
3. ఆయిల్ ఫుడ్స్
ఇండియాలో ఆయిల్ ఫుడ్స్ ట్రెండ్ చాలా ఎక్కువ. ఈ కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ఫాస్ట్ లేదా జంక్ ఫుడ్ తినాలనుకుంటే వెంటనే దాన్ని ఆపండి.
4. ప్రాసెస్డ్ మీట్
ఈ రోజుల్లో ప్రాసెస్డ్ మీట్ ట్రెండ్ చాలా పెరిగింది. తరచుగా ప్రజలు ప్రోటీన్ పొందాలనే కోరికతో మాంసాన్ని తింటారు. కానీ ప్రాసెస్ చేసిన మాంసంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు కారణం అవుతుంది.