Fridge: ఫ్రిజ్లో ఈ ఆహారాలను అస్సలు నిల్వచేయకూడదు.. ఎందుకంటే..?

Fridge: వాస్తవానికి ఏవైనా ఆహారపదార్థాలు చెడిపోకుండా ఉండటానికి వాటిని ఫ్రిజ్లో నిల్వ చేస్తారు.

Update: 2021-11-23 16:15 GMT

ఫ్రిడ్జ్ ఉంచకూడని ఐటమ్స్ (ఫైల్ ఇమేజ్)

Fridge: వాస్తవానికి ఏవైనా ఆహారపదార్థాలు చెడిపోకుండా ఉండటానికి వాటిని ఫ్రిజ్లో నిల్వ చేస్తారు. అంతేకాదు రాత్రిపూట మిగిలిని ఆహారాలను కూడా ఫ్రిజ్లో పెడుతారు. అయితే ఇందులో పెట్టడం వల్ల కొన్ని ఆహారాలు పాడవవు కానీ కొన్ని ఆహారపదార్థాలు మాత్రం ఇందులో పెట్టకూడదు. ఎందుకంటే అవి టాక్సిన్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

1. గుడ్లు

గుడ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు. వాటిని అందులో నిల్వచేసినప్పుడు నీటి కంటెంట్ వల్ల బయటి పొర పగుళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వీటిని తింటే ఆరోగ్యం చెడిపోతుంది. మీరు గుడ్లను ఫ్రీజర్లో నిల్వ చేయాలనుకుంటే వాటిని గాలి చొరబడని కంటైనర్లో ఉంచవచ్చు. ఇది ఖచ్చితంగా కొంత సమయం వరకు బ్యాక్టీరియాను ఆపుతుంది.

2. వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాలను ఫ్రిజ్లో పెట్టకూడదు.ఇలా చేయడం వల్ల వాటిని మళ్లీ వేడి చేయడం కష్టంగా ఉంటుంది. తర్వాత అవి రుచిని కోల్పోతాయి.

3. పండ్లు

మీరు ఫ్రిజ్లో పండ్లను ఉంచినట్లయితే వాటి పోషక విలువలకు ఆటంకం కలుగుతుంది. అంతే కాదు వాటి రుచి కూడా చెడిపోతుంది.

4.దోసకాయ

దోసకాయలను పెద్ద పరిమాణంలో ఫ్రిజ్లో పెట్టకూడదు. వాటి రుచి చాలా వింతగా మారుతుంది. దోసకాయల ఆకృతిలో తేడాలు వస్తాయి.

Tags:    

Similar News