Jackfruit: పనసపండు తిన్న తర్వాత వీటికి దూరంగా ఉండాలి..!
Jackfruit: పనసపండు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి...
Jackfruit: పనసపండు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు పనస పండు తిన్న తర్వాత కొన్ని ఆహారాలని తినకూడదు. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. పనసపండు తిన్న తర్వాత ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
1. బొప్పాయి తినవద్దు
పనసపండు తిన్న తర్వాత బొప్పాయి తినకూడదు. ఇలా చేస్తే చర్మానికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు లూజ్ మోషన్ సమస్య ఉండవచ్చు.
2. పనస తిన్న తర్వాత పాలు తాగకూడదు
చాలా మంది పనసపండు తిన్న తర్వాత పాలు తాగుతారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. దీని వల్ల పొట్టలో వాపుతోపాటు చర్మంపై దద్దుర్లు వస్తాయి. చాలా మందికి చర్మంపై తెల్ల మచ్చల సమస్య మొదలవుతుంది. అందుకే పనస తిన్న తర్వాత పాలకి దూరంగా ఉండాలి.
3. పనస తిన్న తర్వాత బెండకాయ తినకూడదు
పనసపండు తిన్న తర్వాత బెండకాయ అస్సలు తినకూడదు. ఒకవేళ పాదాలలో నొప్పి మొదలవుతుంది. ఇది కాకుండా కడుపులో ఎసిడిటీ సమస్యని ఎదుర్కోవచ్చు.
4. పనస తిన్న తర్వాత పాన్ తినకూడదు
భోజనం చేసిన తర్వాత పాన్ తినడం చాలా మందికి అలవాటు. అయితే పనసపండు తిన్న తర్వాత పాన్ తినకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు.