Immunity: ఈ ఆహారాలు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి..! వీటి విషయంలో జాగ్రత్త..

Immunity: కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం.

Update: 2021-12-29 02:25 GMT

 ఈ ఆహారాలు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి..! వీటి విషయంలో జాగ్రత్త..

Immunity: కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇది లేకుంటే వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా ప్రజలు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించడం మనం గమనించవచ్చు. ఆయుర్వేద టీలు తాగడం, యోగా చేయడం, మసాల టీలు తాగడం, ఫ్యూట్ జ్యూస్‌ వంటివి ప్రయత్నించారు. అయితే మనకు తెలియకుండానే కొన్ని ఆహారాలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. అటువంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న ఆహారాలు రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాల పనిని ఆపుతాయి. వాటి పని సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడతుంది. మీరు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోండి. ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా శరీరానికి హానికరం. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. మొదటి నుంచి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు ఆందోళనను మరింత పెంచాయి. అటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటం ముఖ్యం. మరోవైపు, మీరు ధూమపానం లేదా మద్యం సేవిస్తే అది మీ శరీరానికి చాలా ప్రమాదకరం. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

ఘనీభవించిన ఆహారాలు, చిప్స్ లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీర రోగనిరోధక శక్తిని పాడుచేయటానికి కారణమవుతాయి. ఉప్పు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. పేగు బ్యాక్టీరియాను కూడా మార్చగలదు.ఎక్కువ చక్కెర తీసుకోవడం రోగనిరోధక వ్యవస్థకు హానికరం. నివేదికల ప్రకారం అధిక చక్కెర స్థాయిలు పేగుల పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇది వైరస్‌కు శరీరాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. సాధారణంగా చక్కెరను ఏ విధంగా కూడా తినకూడదని వైద్యులు సలహా ఇస్తారు. 

Tags:    

Similar News