Good Cholesterol Foods: ఈ ఆహారాలు మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి.. ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం..!

Good Cholesterol Foods: మానవ శరీరంలో రెండు రకాల కొలస్ట్రాల్స్‌ ఉంటాయి. ఒకటి మంచిది మరొకటి చెడుది.

Update: 2024-04-30 01:30 GMT

Good Cholesterol Foods: ఈ ఆహారాలు మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి.. ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం..!

Good Cholesterol Foods: మానవ శరీరంలో రెండు రకాల కొలస్ట్రాల్స్‌ ఉంటాయి. ఒకటి మంచిది మరొకటి చెడుది. మంచి కొలస్ట్రాల్‌ను HDL అని చెడు కొలస్ట్రాల్‌ను LDL అంటారు. మంచి కొలెస్ట్రాల్ గుండెను వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే శరీరంలో మంచి కొలస్ట్రాల్‌ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

చియా విత్తనాలు

చియా విత్తనాలు మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఇతర ఆరోగ్యకరమైన పోషకాలకు మూలం. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల ఎల్‌డిఎల్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడంలో సాయపడుతాయి.

బార్లీ

తృణధాన్యాలు బీటా గ్లూకాన్‌ను పెంచుతాయి. ఇది కరిగే ఫైబర్, ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచడానికి పనిచేస్తాయి.

వాల్నట్

వాల్‌నట్స్‌లో ప్రధానంగా ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఇవి ఒక రకమైన మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌. ఇవి గుండెను వ్యాధుల నుంచి కాపాడుతాయి. వీటిని తినడం వల్ల హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

సోయాబీన్

సోయాబీన్‌లో అసంతృప్త కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్లు HDL స్థాయిలను పెంచుతాయి. ఫైటోఈస్ట్రోజెన్లు LDL స్థాయిలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించి మీ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి.

Tags:    

Similar News