Weight Loss: స్థూలకాయం తగ్గాలంటే ఈ ఐదు పనులు తప్పనిసరి.. అవేంటంటే..?

Weight Loss: స్థూలకాయం తగ్గాలంటే ఈ ఐదు పనులు తప్పనిసరి.. అవేంటంటే..?

Update: 2022-02-13 16:00 GMT

Weight Loss: స్థూలకాయం తగ్గాలంటే ఈ ఐదు పనులు తప్పనిసరి.. అవేంటంటే..?

Weight Loss: కరోనా వైరస్ వచ్చిన ఎంటర్ అయినప్పటి నుంచి జనాల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లడం తక్కువై పోయింది. ఎందుకంటే కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. దీని వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. ఫలితంగా శారీరక కార్యకలాపాలు మునుపటి కంటే తక్కువై పోయాయి. ఇది ఊబకాయానికి ప్రధాన కారణంగా మారుతోంది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలు తగ్గడం వల్ల స్థూలకాయం ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు అవసరానికి మించి పెరగడం. దీని వల్ల మధుమేహం, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అధిక బరువు పెరగకుండా ఉండాలంటే బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా రోజువారీ వ్యాయామానికి సమయం కేటాయించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బెల్లీ ఫ్యాట్‌ని నివారించడానికి చాలా మంది వైద్యులు ప్రతిరోజు వాకింగ్‌, రన్నింగ్‌ చేయమని సలహా ఇస్తున్నారు.

రోజూ అల్పాహారం తినాలి. అస్సలు మిస్ చేయకూడదు. తక్కువ చక్కెర, తక్కువ కొవ్వు ఆహారం తినాలి. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు చేర్చాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మధుమేహం, గుండెపోటు, టెన్షన్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. కొవ్వు కూడా కరుగుతుంది. ప్రతి రోజు ఎనిమిది గంటల నిద్రపోవాలి. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

Tags:    

Similar News