Green Tea: గ్రీన్ టీ రుచిని పెంచడానికి ఈ పదార్థాలు సూపర్.. ఏంటంటే..?
Green Tea: గ్రీన్ టీ రుచిని పెంచడానికి ఈ పదార్థాలు సూపర్.. ఏంటంటే..?
Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కరోనా కాలంలో ఎక్కువ మంది అలవాటు చేసుకున్నారు. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. చర్మానికి చాలా మంచిది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. గ్రీన్ టీ రుచిని పెంచడానికి ఈ ఐదు పదార్థాలు కలిపితే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
1. స్టెవియా ఆకులు
స్టెవియా సహజ స్వీటెనర్‌గా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ చేదుగా అనిపించే వారు స్టెవియా ఆకులను కలుపుకోవచ్చు. దీన్ని తాగడం వల్ల క్యాలరీలను తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
2. తేనె
గ్రీన్ టీలో పంచదార కలిపితే ప్రయోజనం ఉండదు. కానీ తేనెను కలపడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, తేనెలోని విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా మిళితమై సూపర్ హెల్తీ డ్రింక్‌గా తయారవుతాయి. ఇది చర్మ సమస్యలను నయం చేస్తుంది.
3. నిమ్మరసం
గ్రీన్ టీ చేదుగా అనిపిస్తే నిమ్మరసం కలుపుకోవచ్చు. సిట్రస్ గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లను మరింత పెంచుతుంది. అయితే గ్రీన్ టీ కాస్త చల్లారాక మాత్రమే అందులో నిమ్మరసం కలపాలి.
4. పుదీనా, దాల్చిన చెక్క
గ్రీన్-టీలో పుదీనా ఆకులను కలపడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. అలాగే దాల్చిన చెక్క బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇవి గ్రీన్ టీ రుచిని పెంచుతాయి.
5. అల్లం
క్యాన్సర్‌ను నివారించడంలో అలం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది ఉబ్బసం, మధుమేహం, ఋతుస్రావం లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు.