Kidneys Clean: కిడ్నీలు క్లీన్‌గా ఉండాలంటే ఈ పానీయాలు తప్పనిసరి..!
Kidneys Clean: శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. ఇవి పనిచేయకపోతే మనిషి చనిపోతాడు.
Kidneys Clean: శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. ఇవి పనిచేయకపోతే మనిషి చనిపోతాడు. కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా విషపదార్థాలని తొలగిస్తాయి. కొన్నిసార్లు వాటిపై ఒత్తిడి బాగా పెరిగి అవి ఫెయిల్ అవుతుంటాయి. కానీ రోజూ ఒక పానీయం తాగడం ద్వారా మీరు కడ్నీలని శుభ్రపరుచుకోవచ్చు. అవి దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఆ పానీయాలు ఏంటో వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
మూత్రపిండాల ప్రధాన విధి శరీరంలోని మురికిని, ద్రవాలను శరీరం నుంచి మూత్రం ద్వారా బయటకు పంపడం. ఇది కాకుండా కిడ్నీ మానవ శరీరంలోని ఉప్పు, పొటాషియం, యాసిడ్ పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది. దీంతో పాటు మన శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడానికి అవసరమైన హార్మోన్లు మూత్రపిండాల నుంచి బయటకు వస్తాయి. హార్వర్డ్ నివేదిక ప్రకారం.. రోజూ 2 గ్లాసుల నిమ్మకాయ రసం తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. మూత్రపిండాలు వాటిపనిచేయడానికి సులువవుతుంది. ప్రతిరోజు 2 నుంచి 2.5 లీటర్ల మూత్ర విసర్జన చేసే వ్యక్తులలో రాళ్లు రావడం చాలా తక్కువ. మీరు ఈ కిడ్నీ-హెల్తీ డ్రింక్ ను ఉదయం మధ్యాహ్నం త్రాగవచ్చు.
1. పుదీనాతో నిమ్మకాయ
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, పుదీనా ఆకులు, కొంచెం చక్కెర వేసి బాగా కలపండి. దీనిని ప్రతిరోజు తాగండి. ఇలా చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి.
2. మసాలా లెమన్ సోడా
ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, సోడా కలపండి. ఇది కూడా కిడ్నీకి ఉపయోగపడే పానీయం. దీనిని కూడా రోజుకి రెండు సార్లు తీసుకుంటే మంచిది.
3. కొబ్బరి షికంజీ
ఈ హెల్తీ డ్రింక్ చేయడానికి ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లు కలపండి. ఈ నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలు. కిడ్నీలు క్లీన్ అవుతాయి.