Mens Health: ఈ వ్యాధులు మహిళలకంటే పురుషులకి చాలా ప్రమాదం.. ఎందుకంటే..?
Mens Health: పురుషులు, మహిళల శరీరాలు అనేక అంశాలలో భిన్నంగా ఉంటాయి.
Mens Health: పురుషులు, మహిళల శరీరాలు అనేక అంశాలలో భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని వ్యాధులు స్త్రీల కంటే పురుషులని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. పురుషులకి కొన్ని వ్యాధులని తట్టుకునే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డిప్రెషన్
మహిళలు మానసికంగా బలహీనంగా ఉంటారని చెబుతారు. కానీ వారితో పోలిస్తే డిప్రెషన్ సమస్య పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం స్త్రీలు తమ సమస్యలను ఇతరులతో ఎక్కువగా వ్యక్తపరుస్తారు. పురుషులు తమ భావాలను దాచుకోవడం వల్ల వారు లోలోపలే ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు సన్నిహితులతో మాట్లాడటం మంచిది. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె జబ్బులు
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయి వల్ల పురుషులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం అవసరం.
మధుమేహం
మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా నూనె పదార్థాలను తింటారు. దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. తరువాత మధుమేహానికి కారణం అవుతుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అవసరం.
కాలేయ వ్యాధి
మీరు గమనిస్తే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మద్యపానానికి బానిసలుగా ఉంటారు. దీని కారణంగా వారి కాలేయం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఈ అవయవానికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
ఊపిరితిత్తుల వ్యాధి
స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా పొగతాగడం, బయటకు వెళ్లినప్పుడు కాలుష్యానికి గురికావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పురుషులు ఊపిరితిత్తుల వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయి.