Fridge Water : ప్రిజ్ వాటర్ అదే పనిగా తాగుతున్నారా? ఈ జబ్బులు గ్యారేంటీ..!

Fridge Water : చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం సైతం ఉంది. అంతేకాదు జీర్ణక్రియ సైతం మందగిస్తుంది. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.

Update: 2024-06-26 13:00 GMT

Fridge Water : ప్రిజ్ వాటర్ అదే పనిగా తాగుతున్నారా? ఈ జబ్బులు గ్యారేంటీ

Fridge Water : చాలామంది దాహం వేసినప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు.మధ్యాహ్నం బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిజ్ లోంచి చల్లని నీళ్ల బాటిల్ తీసి తాగడం అనేది చాలా ఇళ్లల్లో చూసే ఉంటాం. అయితే, ఈ చల్లని నీరు మీ ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్తున్నారు.మీకు కూడా ఫ్రిజ్‌లోని ఐస్ వాటర్ తాగడం అలవాటు ఉంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడండి.ఎందుకంటే ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల ఊబకాయం పెరగడమే కాకుండా దానితో పాటు ఇతర వ్యాధులను కలుగచేసే ప్రమాదం ఉంది.సాధారణంగా మనం ఎండలో తిరిగినప్పుడు వేడి కారణంగా మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే సమయంలో మీరు చల్లటి నీటిని తాగితే, శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఈ మార్పు మీకు అనారోగ్యం కలిగిస్తుంది.చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం సైతం ఉంది. అంతేకాదు జీర్ణక్రియ సైతం మందగిస్తుంది. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.

అజీర్తికి అవకాశం:

ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల జీర్ణశక్తి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.చల్లటి నీరు తాగడం వల్ల పెద్ద పేగు సంకోచం చెందుతుంది.ఇది పొట్టను శుభ్రపరచడంలో ఆటంకం కలిగిస్తుంది.ఫలితంగా మలబద్ధకం సమస్య వస్తుంది.జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడంతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి.అంతేకాదు ఆకలిని సైతం మందగించేలా చేస్తుంది.మన కడుపులో ఉండే జఠరాగ్నిని చల్లటి నీరు తాగడం వల్ల ఆకలిని చంపేస్తుంది. ఫలితంగా మీరు బలహీనపడే అవకాశం ఉంది.

ఊబకాయం ప్రమాదం పెంచుతుంది:

చాలా చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు చాలా నెమ్మదిగా తగ్గుతుంది. ఫలితంగా ఊబకాయం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. శరీరంలో కొవ్వును కరిగించుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, చల్లని నీరు తాగడం మానుకోండి. చల్లటి నీటికి బదులుగా, గోరువెచ్చని నీరు త్రాగితే త్వరగా బరువు తగ్గవచ్చు.

గుండెకు ప్రమాదకరం:

చల్లని నీరు గుండెకు సైతం ప్రమాదకరమైనది. ఎండ వేడిలో తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీరు వెంటనే తాగితే శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ మందగిస్తుంది. ఇది మాత్రమే కాదు, చల్లని నీరు తరచుగా రక్త నాళాలను గట్టిపరుస్తుంది, ఇది గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News