Health Tips: ఈ చెడ్డ అలవాట్లు ఎముకలని బలహీనపరుస్తాయి.. ఈరోజే వదిలేయండి..!
Health Tips: శరీరం బలంగా ఉండాలంటే ముందుగా ఎముకలు దృఢంగా ఉండాలి.
Health Tips: శరీరం బలంగా ఉండాలంటే ముందుగా ఎముకలు దృఢంగా ఉండాలి. కానీ వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనపడుతాయి. ఎందుకంటే 35 నుంచి 40 సంవత్సరాల వయస్సులో శరీరంలో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఎముకలను ప్రభావితం చేస్తుంది. పగళ్లు రావడం మొదలవుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రోజూ తినే ఆహారంలో క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చేర్చాలి. అప్పుడే శరీర నొప్పులు, ఎముకలు పగుళ్లు రాకుండా చూసుకోవచ్చు. ఎముక బలహీనంగా మారడానికి కారణాలేంటో ఈరోజు తెలుసుకుందాం.
1. రెడ్ మీట్ ఎక్కువగా తినే వారికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. దీనివల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. విసర్జన సమయంలో చాలా క్యాల్షియం బయటకు వెళుతుంది. కాబట్టి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి.
2. శీతల పానీయాలు వంటి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు ఎముక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంను తగ్గించడానికి పనిచేస్తుంది. దీంతో ఎముకలు క్రమంగా బలహీనపడుతాయి.
3. కొందరు ఎసిడిటీ మందులను ఎక్కువగా తీసుకుంటారు. వీటిని నియంత్రించాలి. ఈ మందుల కారణంగా కాల్షియం, మెగ్నీషియం, జింక్ లోప సమస్యలు ఏర్పడుతాయి.
4. ఎముకలు దృఢంగా ఉండాలంటే టీ, కాఫీలని ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ ఎముకలపై ప్రభావం చూపుతుంది.
5. రోజువారీ ఆహారంలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. ఎందుకంటే వీటిలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. తీపి కోసం చక్కెరను తినేబదులు బెల్లం తినడం ప్రారంభించండి. తద్వారా శరీరానికి కాల్షియం, ఐరన్ రెండూ అందుతాయి. పాల ఉత్పత్తులను తినకపోతే ఇప్పటి నుంచి తీసుకోవడం ప్రారంభించండి. పాలు కాకుండా పెరుగు, పనీర్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.