Health Tips: ఈ చెడు అలవాట్లు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.. అవేంటంటే..?
Health Tips: ఈ చెడు అలవాట్లు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.. అవేంటంటే..?
Health Tips: చెడు అలవాట్లు పురుషుల స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఒత్తిడి, చెడు ఆహారం, తప్పుడు జీవనశైలి కారణంగా సంతానోత్పత్తి కలుగదు. దీనివల్ల చాల ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పురుషులలో ఒత్తిడి కారణంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. కాబట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి.
వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊబకాయం కారణంగా స్పెర్మ్ కదలిక మందగిస్తుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒకే చోట కూర్చునే అలవాటును వదిలేయాలి. మరోవైపు మగవారు రోజూ వ్యాయామం చేయాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది.
అలాగే మానసికంగా కుంగిపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుకే ఆలస్యంగా నిద్రించే అలవాటును మార్చుకోండి. మద్యం, పొగాకు వినియోగం పురుషులకు చాలా హానికరం. ఎందుకంటే ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం టెస్టోస్టెరాన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం పడుతుంది. అందుకే పురుషులు ఈ అలవాట్లు మానుకుంటే మంచిది.