Weak Bones: బలహీనమైన ఎముకలకు కారణం మీరు చేసే ఈ తప్పులే.. అవేంటంటే..?

Weak Bones: ఎముకలు బలహీనంగా ఉంటే ఏ పని చేయలేం. తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. శరీరం ధృఢంగా ఉండాలంటే అందుకు ఎముకలు గట్టిగా ఉండాలి.

Update: 2023-07-04 16:00 GMT

Weak Bones: బలహీనమైన ఎముకలకు కారణం మీరు చేసే ఈ తప్పులే.. అవేంటంటే..?

Weak Bones: ఎముకలు బలహీనంగా ఉంటే ఏ పని చేయలేం. తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. శరీరం ధృఢంగా ఉండాలంటే అందుకు ఎముకలు గట్టిగా ఉండాలి. కానీ నేటికాలంలో తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఎముకలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పెళుసుగా మారిపోయి చిన్న చిన్న కారణాల వల్ల విరిగిపోతున్నాయి. బలమైన ఎముకల కోసం ఈ చెడ్డ అలవాట్లని మానుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. కూల్‌ డ్రింక్స్‌

నేటి కాలంలో కూల్‌డ్రింక్స్‌ తాగడం బాగా పెరిగింది. పెళ్లిళ్లు, పార్టీలు లేదా రోజువారీ జీవితంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుంచి కాల్షియంను తొలగిస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.

2. ఎక్కువ టెన్షన్

మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజుల్లో డబ్బు లేకపోవడం, ఆఫీసులో సమస్యలు, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం కారణాల వల్ల చాలామంది టెన్షన్‌కి గురవుతున్నారు. ఎముకలు బలంగా ఉండాలంటే టెన్షన్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే టెన్షన్‌ వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దీని కారణంగా కాల్షియం శరీరం నుంచి టాయిలెట్ ద్వారా బయటికి వెళ్లిపోతుంది.

3. ప్రొటీన్‌ ఫుడ్‌

ఎముకల దృఢత్వానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసం, గుడ్లు, సోయాబీన్, పప్పులు వంటి వాటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

4. టీ, కాఫీ ఎక్కువగా తాగడం

భారతదేశంలో టీ, కాఫీ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు టీ, కాఫీలు తాగుతారు. ఈ పానీయాలలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం అవసరాన్ని పెంచుతుంది. అందుకే ఎక్కువ కాల్షియం ఉండే ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

Tags:    

Similar News