Black Lips: మీ పెదాలు నల్లగా మారడానికి ఈ చెడ్డ అలవాట్లే కారణం..!

Black Lips: ప్రతి ఒక్కరూ తమ పెదవులు అందంగా ఉండాలని కోరుకుంటారు.

Update: 2022-06-21 15:15 GMT

Black Lips: మీ పెదాలు నల్లగా మారడానికి ఈ చెడ్డ అలవాట్లే కారణం..!

Black Lips: ప్రతి ఒక్కరూ తమ పెదవులు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అనేక ఉత్పత్తులని ప్రయత్నిస్తారు. అయితే కొన్ని చెడ్డ అలవాట్ల వల్ల మీ పెదాలు నల్లగా మారుతాయి. మనం ప్రతిరోజూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంటాం. దీని వల్ల పెదాలు నల్లగా మారడమే కాకుండా పొడిగా మారతాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

డెడ్ స్కిన్ కారణంగా

రోజూ పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. మీరు ఇలా చేయకపోతే మీ చర్మంపై డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. దీనివల్ల పెదవులపై ముడతలు రావడమే కాకుండా పెదాల చర్మం పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెదవుల డెడ్ స్కిన్ ను రోజూ శుభ్రం చేసుకోవాలి.

లిప్‌స్టిక్‌ అలెర్జీ

కొన్ని లిప్‌స్టిక్‌ల లోపల ఉండే రసాయనాలు పెదాలను నల్లగా చేస్తాయి. కొంతమందికి లిప్‌స్టిక్‌ అలెర్జీ కూడా ఉంటుంది. దీనివల్ల పెదవులపై హైపర్పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. పెదవులు నల్లగా కనిపిస్తాయి.

ధూమపానం

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అయితే అది మన ఊపిరితిత్తులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్మోకింగ్ వల్ల మీ పెదాలు నల్లగా మారుతాయి. అవును మితిమీరిన ధూమపానం పెదవులు నల్లబడటానికి కారణమవుతుంది.

నీటి కొరత

శరీరంలో నీటి కొరత ఉంటే పెదవుల రంగులో మార్పు కనిపిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి.పెదవులపై క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

Tags:    

Similar News