Diabetic Patients: షుగర్ పేషెంట్లకి ఈ ఆయుర్వేద ఔషధాలు దివ్య ఔషధం..!
Diabetic Patients: మీకు ఒక్కసారి మధుమేహం ఉన్నట్లు తేలితే జీవితాంతం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి.
Diabetic Patients: మీకు ఒక్కసారి మధుమేహం ఉన్నట్లు తేలితే జీవితాంతం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు ఈ పరిస్థితిలో మీరు తీపి పదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా కష్టం. అయితే కొన్ని ఆయుర్వేద పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
1. మధుమేహ వ్యాధిగ్రస్తులకి నేరేడు విత్తనాలు దివ్యౌషధం. మొదట నేరేడు గింజలని ఎండలో ఆరబెట్టి ఆపై వాటిని మెత్తగా పొడి చేయాలి. తర్వాత ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.
2. దాల్చిన చెక్క తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని తీసుకోవాలని సూచిస్తారు. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తాగవచ్చు.
3. మెంతులు షుగర్ పేషెంట్లకి దివ్య ఔషధమని చెప్పవచ్చు. దీనిని సాధారణంగా మసాలాగా ఉపయోగిస్తారు. అయితే మీరు ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
4. మీరు తరచుగా అంజీర్ పండ్లను తింటూ ఉంటారు. కానీ దాని ఆకుల సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. అంజీర్ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. మీరు దీన్ని పచ్చిగా నమలవచ్చు లేదా ఆకులను ఉడకబెట్టి నీటిని తాగవచ్చు.
5. వెల్లుల్లిని ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద లక్షణాల నిధి. మీరు దీని మొగ్గలను పచ్చిగా నమిలి తింటే కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా తగ్గించవచ్చు.