Banana Side Effects: అరటిపండు ఎక్కువగా తింటే ఈ దుష్ప్రభావాలు..!

Banana Side Effects: అరటిపండు ఎక్కువగా తింటే ఈ దుష్ప్రభావాలు..!

Update: 2022-03-13 12:30 GMT

Banana Side Effects: అరటిపండు ఎక్కువగా తింటే ఈ దుష్ప్రభావాలు..!

Banana Side Effects: అరటిపండు తినడానికి రుచిగా, తియ్యగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు. రోజూ అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల అనేక నష్టాలు కూడా ఉంటాయి. అందుకే అరటిపండ్లు తినడానికి లిమిట్ పెట్టుకోవాలి. మీరు ఒక రోజులో 1-2 అరటిపండ్లను హాయిగా తినవచ్చు. ఎటువంటి సమస్య ఉండదు. చాలా వర్కవుట్‌లు చేసినవారు రోజుకు 3-4 అరటిపండ్లను తినవచ్చు. అయితే దీని కంటే ఎక్కువ అరటిపండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్పలితాలను తెలుసుకుందాం. 

అరటిపండ్లు ఎక్కువగా తినడం ద్వారా మీరు లావుగా మారుతారు. అరటిపండులో ఫైబర్, సహజ చక్కెర ఉంటుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అరటిపండు ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి అది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి వస్తుంది. కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. పండిన అరటిపండు తినడం వల్ల పొట్ట క్లియర్ అవుతుంది. అయితే అరటిపండు కొద్దిగా పండనిది తింటే అది మలబద్ధకాన్ని కలిగిస్తుంది. అందుచేత పచ్చి అరటిపండు తినకండి అలాగే పండిన అరటిపండును ఒక పరిమితిలో తింటే మంచిది.

మధుమేహం ఉన్నవారు అరటిపండు తినకుండా ఉండాలి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే షుగర్ ఎక్కువగా ఉన్నవారు అరటిపండ్లను తక్కువగా తినాలి. అరటిపండ్లను ఎక్కువ పరిమాణంలో తింటే దంతక్షయం తలెత్తుతుంది. అరటిపండ్లలో టైరోసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో టైరమైన్‌గా మారుతుంది. ఇది మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. ఆస్తమా ఉన్నవారు అరటిపండ్లను పరిమితంగా తినాలి.

Tags:    

Similar News